Homeటాప్ స్టోరీస్మాస్ లుక్ లో క్లాస్ గా అదరగొడుతోన్న చిరు

మాస్ లుక్ లో క్లాస్ గా అదరగొడుతోన్న చిరు

మాస్ లుక్ లో క్లాస్ గా అదరగొడుతోన్న చిరు
మాస్ లుక్ లో క్లాస్ గా అదరగొడుతోన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 154వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. బాబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈరోజు ఉదయం లాంచ్ చేయగా కొద్దిసేపటి క్రితం ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో చిరు అదిరిపోయాడనే చెప్పాలి. బ్లాక్ బ్యాక్ డ్రాప్ లో గోల్డెన్ కలర్ షేడ్ తో ఉన్న ఫస్ట్ లుక్ లో చిరంజీవి కుమ్మేసాడు. స్టైల్ గా సిగరెట్ వెలిగిస్తూ ఒకప్పటి చిరుని గుర్తుకుతెస్తున్నాడు.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య రిలీజ్ కోసం కూడా ఎదురుచూస్తున్నాడు. మూడేళ్ళ క్రితమే మొదలైన ఆచార్య మొత్తానికి ఫిబ్రవరి 4న విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దీనికి దర్శకుడు.

- Advertisement -

ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నటిస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ ను కూడా షురూ చేయనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All