
ఢిల్లీ సీఎంకు పవన్ హీరోయిన్ రిక్వెస్ట్!
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `బంగారం`. 2006లో వచ్చిన ఈ చిత్రం ద్వరా మీరా చోప్రా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత జగన్మోహిని, మారో, వాన, గ్రీకువీరుడు వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపును మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తమిళ, హిందీ చిత్రాలకే పరిమితం అయిపోయింది.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న మీరా చోప్రా ప్రస్తుతం హిందీలో `మొగలిపువ్వు` చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో వుంటున్న ఈ సుందరి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రినే సోషల్ మీడియా వేదికగా మీరా రిక్వెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన తండ్రికి జరిగిన చేదు సంఘటనని ఢిల్లీ ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
ఢిల్లీలోని పోలీస్ కాలనీలో తన తండ్రి వాకింగ్ చేస్తుండగా ఇద్దరు ఆకతాయిలు స్కూటర్ పై వచ్చి కత్తి చూపించి బెదిరించారని, తన తండ్రి వద్ద వున్న ఫోన్‌ని లాక్కెళ్లారని మీరా చోప్రా ఆసహనం వ్యక్తం చేసింది. విషయాన్నే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు, నగర సీపీకి తెలియజేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.