Homeటాప్ స్టోరీస్మీరాచోప్రా వివాదంపై క‌ద‌లిక మొద‌లైంది!

మీరాచోప్రా వివాదంపై క‌ద‌లిక మొద‌లైంది!

మీరాచోప్రా వివాదంపై క‌ద‌లిక మొద‌లైంది!
మీరాచోప్రా వివాదంపై క‌ద‌లిక మొద‌లైంది!

`బంగారం` ఫేమ్ మీరా చోప్రా , ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా అగ్లీవార్ మొలైన విష‌యం తెలిసిందే. త‌న‌కు ఎన్టీఆర్ ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్ప‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై బూతుల‌తోవిరుచుకుప‌డ్డారు. దీంతో హీరో ఫ్యాన్స్‌, హీరోయిన్ మ‌ధ్య వివాదం చోటుచేసుకుంది. త‌న‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చంపేస్తామంటూ ఎన్టార్ ఫ్యాన్స్ అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నార‌ని, త‌న‌కు వ‌రి వ‌ల్ల ప్రాణహానీ వుంద‌ని మీరా చోప్రా హైద‌రాబాద్ సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రియంచ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఎనిమిది అకౌంట్‌ల నుంచి మీరాకు అస‌భ్యక‌ర‌మైన కామెంట్‌లు వ‌చ్చాయ‌ని సైబ‌ర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. అందులో ఎన్‌టీఆర్‌భీమ్‌99, గ‌ణేష్ వంటి అకౌంట్లు ప్రధానంగా వున్న‌ట్టు ఐడెంటిఫై చేశారు. వీరిపై ఐటీ యాక్ట్ కింద 67, 509, 506, 67ఏ సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేసినట్టు తెలిసింది. మీరాచోప్రా ఢిల్లీలో వుంటోంది కాబ‌ట్టి ఈ కేసుల్ని ఢిల్లీకి బ‌దిలీ చేస్తున్నార‌ట.

- Advertisement -

దీంతో మీరాచోప్రాని ఆన్ లైన్ వేదిక‌గా దూషించిన వారు ఢిల్లీ వెళ్లి విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని తెలుస్తోంది. ఇలాంటి ఫ్యాన్స్‌ని పెట్టుకుని ఎన్టీఆర్ ఎలా స్టార్ అయ్యాడో అర్థం కావ‌డం లేదంటూ ఇటీవ‌ల మీరాచోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All