
గత రెండు రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పవన్‌కల్యాణ్ హీరోయిన్ మీరాచోప్రాకు మధ్య ఆన్ లైన్‌లో అగ్లీ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగులో సినిమాలు దాదాపుగా మానేసి హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో వుంటున్న మీరా చోప్రా లాక్‌డౌన్ కారణంగా ఇంటి పట్టునే వుంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కి అందుబాటులో వుంటోంది. నిత్యం హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తున్న మీరాచోప్రా ఇటీవల ఇన్‌స్టా లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.
ఈ సందర్భంగా ప్యాన్స్, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇదే క్రమంలో తనకు తెలుగులో ఏ హీరో ఇష్టమని ఎన్టీఆర్ అభిమాని అడిగితే తనకు మహేష్‌బాబు అంటే ఇష్టమని టక్కున చెప్పేసింది. మరి ఎన్టీఆర్ అంటే తనెవరో తనకు తెలియదని చెప్పంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోనే తెలియదంటుందా? అని మీరాచోప్రాపై బూతు పురాణం అందుకున్నారు.
దీంతో జరిగిన తప్పేంటో తెలుసుకున్న మీరా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని, ఎన్టీఆర్‌ని విమర్శించడం మొదలుపెట్టింది. అంతేనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకింత నీచంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని, ఈ విషయంలో పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ బెస్ట్ అని, వాళ్లు చాలా సౌమ్యులని, పవన్ చెబితే వింటారని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై మళ్లీ పంచ్ వేయడం ఆసక్తికరంగా మారింది.