Homeటాప్ స్టోరీస్చిన్మయి ని చంపుతామని బెదిరిస్తున్నారట

చిన్మయి ని చంపుతామని బెదిరిస్తున్నారట

chinmayiసింగర్ చిన్మయి శ్రీపాద ని చంపుతామని , యాసిడ్ దాడి చేస్తామని కొంతమంది అదేపనిగా బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది . నిన్న తమిళనాట మీడియా ముందుకు వచ్చిన చిన్మయి లైంగిక ఆరోపణలు చేసినందుకు నన్ను చంపేస్తామని , యాసిడ్ దాడి చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని ఇలాంటి బెదిరింపులకు నేను భయపడేది లేదని …… వైరముత్తు పై నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని అంతేకాదు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని వాటితో న్యాయపోరాటం చేస్తానని సవాల్ విసురుతోంది చిన్మయి . ఈ సంఘటన ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావ్ ? అని ప్రశ్నిస్తున్నారు …… ఇప్పుడు చెబితే తప్పా ? ఇప్పటికైనా మాకు మాట్లాడే స్వేఛ్చ లేదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోతోంది చిన్మయి .

తమిళనాట ప్రముఖ రచయితగా పేరున్న వ్యక్తీ వైరముత్తు . అయితే ఆ వైరముత్తు పై లైంగిక ఆరోపణలు చేసింది చిన్మయి . ఈ సంఘటన జరిగి చాలాకాలం అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నావ్ అంటూ కొంతమంది అదేపనిగా చిన్మయి ని వేదిస్తున్నారట ! దాంతో ఆవేశంతో మీడియా ముందుకు వచ్చింది . లైంగిక వేధింపుల పై పోరాటం చేస్తానని అంటోంది చిన్మయి . దాంతో కొంతమంది బెదిరిస్తున్నారట . ప్రస్తుతం మీటూ దేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది . ఇక సినిమా రంగంలో అయితే వణుకు మొదలయ్యింది .

- Advertisement -

English Title: #Me too : chinmayi fires again on vairamuthu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All