Homeటాప్ స్టోరీస్వైరముత్తు పై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి

వైరముత్తు పై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి

singer chinmayi sripaada sensational tweets on vairamuthuసింగర్ చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు పై సంచలన ఆరోపణలు చేసింది . పలువురు గాయనీమణులను లోబరుచుకోవడానికి ప్రయత్నాలు చేసాడని అయితే అందులో కొంతమంది మాత్రం అతడికి ఎదురు తిరిగారని , స్వచ్చమైన వ్యక్తిత్వం ఉన్న గొప్పవాడని అందరూ అనుకున్నారని కానీ తమరు రచయిత ముసుగులో ఉన్న నయవంచకుడని ఈ సమాజానికి తెలియాల్సి ఉందని ట్వీట్ చేసింది చిన్మయి . దాంతో ఒక్కసారిగా తమిళనాట కలకలం చెలరేగింది చిన్మయి శ్రీపాద ట్వీట్ తో . తమిళనాట వైరముత్తు కు ఏనలేని కీర్తి ప్రతిష్టలున్నాయి , అయితే ఒక్కసారిగా ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు చిన్మయి చేయడంతో సంచలనంగా మారింది .

ఈ విషయం చిన్మయి కి ఎలా తెలిసిందంటే …….. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ ట్వీట్ చేసి చిన్మయి సంచలనం సృష్టించింది . దాంతో ఆమెకు వ్యక్తిగతంగా పలువురు సింగర్ లు మొరపెట్టుకోవడంతో పాటుగా కొన్ని స్క్రీన్ షాట్ లను చిన్మయి కి పంపించారట ! దాంతో వాటిని కూడా లీక్ చేసింది చిన్మయి . వైరముత్తు పట్ల సానుకూలంగా ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ ట్వీట్ ల వర్షం చూసి . అయితే ఇంకా వైరముత్తు ఈ లైంగిక వేధింపుల పట్ల స్పందించలేదు . అతడి వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి . నేను అలంటి వాడిని కాదు నన్ను అపార్దం చేసుకున్నారు అని అంటాడేమో !

- Advertisement -

English Title: singer chinmayi sripaada sensational tweets on vairamuthu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All