Homeటాప్ స్టోరీస్మాస్ మహారాజా 10 తలల రావణాసుర!

మాస్ మహారాజా 10 తలల రావణాసుర!

మాస్ మహారాజా 10 తలల రావణాసుర!
మాస్ మహారాజా 10 తలల రావణాసుర!

మాస్ మహారాజా రవితేజ దూకుడు మాములుగా లేదు. ఏకంగా 5 సినిమాలు ఇప్పుడు వివిధ ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయ్. ఖిలాడీ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసిన రవితేజ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాలను సెట్స్ మీద ఉంచాడు. ఈ మూడు సినిమాలు కాకుండా మరో రెండు చిత్రాలను రీసెంట్ గా ప్రకటించాడు రవితేజ. అందులో ఒకటి టైగర్ నాగేశ్వరావు కాగా మరొకటి సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయబోయే చిత్రం. ఈ రెండు చిత్రాల్లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రవితేజ నటించబోతున్నాడు.

సుధీర్ వర్మ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. దీనికి రావణాసుర అనే ఆసక్తికర టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. ఇక ఫస్ట్ లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంది. రవితేజ నెగటివ్ లుక్ లో అదరగొడుతున్నాడు. వెనకాల మరో 9 రవితేజ మొహాలు ఉన్నాయి. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకాంత్ విస్సా రచించాడు.

- Advertisement -

రవితేజ నటించిన ఆంజనేయులు సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన సుధీర్ వర్మ ఇప్పుడు రవితేజను డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. వచ్చే ఏడాది ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. రావణాసుర చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలిసే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All