Homeటాప్ స్టోరీస్మెగా సెటైర్ తో మారుతిని టార్గెట్ చేసిన నెటిజన్లు

మెగా సెటైర్ తో మారుతిని టార్గెట్ చేసిన నెటిజన్లు

మెగా సెటైర్ తో మారుతిని టార్గెట్ చేసిన నెటిజన్లు
మెగా సెటైర్ తో మారుతిని టార్గెట్ చేసిన నెటిజన్లు

సోషల్ మీడియా విస్తృతమయ్యాక ముసుగు వేసుకున్న నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం సర్వ సాధారణమైపోయింది. ఎలాగో మనమెవ్వరం అనేది ప్రపంచానికి తెలీదు, మనం ఎవరినైనా ఏదైనా అనేయొచ్చు, మనల్ని ఏం చేయలేరు అన్న ధోరణి కొంత మంది ట్విట్టర్ యూజర్లలో ఎక్కువైపోయింది. ఇలాంటి ట్విట్టర్ యూజర్ల వల్ల చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడిన సందుదర్భాలున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో దర్శకుడు మారుతి చేరాడు. సాధారణంగా ఇలాంటి సంఘటనలప్పుడు వారి దూషణలకు రిప్లై ఇవ్వకపోవడమే మంచిది. వాటిని పట్టించుకోకపోతే త్వరగా ఫెడౌట్ అయ్యే చాన్సులుంటాయి, అదే ఒక్కసారి దేనికైనా స్పందిస్తే ఇక అదే పనిగా ఒకరి తర్వాత ఒకరు మాటలతో దాడులు చేయడం మొదలుపెడతారు. ప్రస్తుతం ప్రతిరోజూ పండగే సినిమాను డైరెక్ట్ చేస్తోన్న మారుతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనని టార్గెట్ చేస్తూ ఒక ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ కు మారుతి తన అసహనాన్ని వ్యక్తం చేసాడు.

వివరాల్లోకి వెళితే.. ప్రతిరోజూ పండగే చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి దీపావళి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఫీల్ గుడ్ సినిమా అందించబోతున్నారనే ఫీలింగ్ రప్పించడంలో ప్రతిరోజూ పండగే టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇది పక్కనపెడితే దర్శకుడు మారుతి ట్విట్టర్ లో చాలా సరదాగా ఉండే వ్యక్తి, నిత్యం ట్విట్టర్ యూజర్లకు టచ్ లో ఉంటాడు. వారు తన చిత్రాల గురించి అడిగే ప్రశ్నలకు వివరాలు అందిస్తూ ఉంటాడు. మారుతి మెగా ఫ్యామిలీకి కూడా వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో వ్యక్తపరిచాడు కూడా. ప్రస్తుతం మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తోనే ప్రతిరోజూ పండగే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కూడా. ఈ మధ్య ఒక పవన్ అభిమాని, దీపావళికి విడుదల చేసిన ప్రతిరోజూ పండగే పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ను పెట్టి ఈయన సంతోషంగా ఉంటే ప్రతిరోజూ పండగే అని క్యాప్షన్ జత చేసాడు. దీనికి పవన్ అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -

ఇప్పుడు ఇదే పోస్టర్ ను మారుతి తన అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు. దీనికి ఒక ట్విట్టర్ యూజర్ మారుతిని కామెంట్ చేసాడు. ఎన్నిసార్లని మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని వాడుకుంటావంటూ ఆ నెటిజెన్ స్పందించాడు. దీనికి కోపం తెచ్చుకున్న మారుతి ముందు తెలుగు రాయడం నేర్చుకోమని సలహా ఇచ్చాడు. అలాగే అతను రాసిన మిస్టేక్స్ అన్నీ ఎత్తి చూపించాడు. అంతే కాకుండా నచ్చి షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కడికి ఎటకారం ఎక్కువైపోతోంది అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. మరో ట్విట్టర్ యూజర్ ఈ పోస్టర్ డిజైన్ చేసింది మీరేనటగా అని అడిగితే అంత ఖాళీగా నేను లేను అంటూ పంచ్ వేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది మారుతి.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All