Homeటాప్ స్టోరీస్ప్రణయ్ ని హత్య చేయించిన మారుతీరావు కు మద్దతుగా ర్యాలీ

ప్రణయ్ ని హత్య చేయించిన మారుతీరావు కు మద్దతుగా ర్యాలీ

Maruthi rao supporters held rally in miryalagudaమిర్యాలగూడలో ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే ఆ విషయంలో ప్రణయ్ ని హత్య చేయించిన అమృత తండ్రి మారుతీరావు పై ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా జరిగిన సంఘటనతో మిర్యాలగూడ ప్రజలు పిచ్చ షాక్ ఇచ్చారు . ఏకంగా మారుతీరావు కి మద్దతుగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడమే కాకుండా ఏకంగా జిల్లా ఎస్పీ ని కలిసి వినతి పత్రం ఇవ్వడమే కాకుండా ప్రణయ్ విగ్రహం మిర్యాలగూడలో పెడితే సహించేది లేదని , అందుకు మీరు అనుమతి ఇవ్వొద్దని వేడుకున్నారు కూడా . అంతేగాదు జైల్లో ఉన్న మారుతీరావు ని కలిసేలా అనుమతి ఇవ్వాలని కూడా కోరారు అయితే జైలు అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు కానీ మారుతీరావు తమ్ముడు శ్రవణ్ ని మాత్రం కలిసేలా అనుమతి ఇచ్చారు . దాంతో శ్రవణ్ ని కలిసి మీకు మద్దతుగా మేమున్నాం అంటూ పెద్ద ఎత్తున మిర్యాలగూడ వర్తకులు పాల్గొన్నారు .

ఎస్పీ ని కలిసిన సమయంలో ప్రణయ్ విగ్రహం పెట్టడం వల్ల అనర్దాలకు దారి తీస్తుందని చక్కగా వివరించారు . ప్రణయ్ విగ్రహం పెట్టి ఏ సందేశం ఇవ్వనున్నామో చెప్పారు .

- Advertisement -

ప్రణయ్ పెద్దగా చదువుకోలేదు
చిన్న వయసులోనే ప్రేమించి అదే నిజమైన ప్రేమ అనుకోవడం
పాఠశాలకు వెళ్లే సమయంలో ప్రేమించి , పెద్దవాళ్ళని ఎదురించి అమ్మాయిని లేపుకుపొమ్మని అందుకు ఈ విగ్రహమే సమాధానం అని చెబుదామా !

ప్రేమించుకున్నంత మాత్రాన పెద్దల అనుమతి లేదా ?
20 ఏళ్ల పాటు అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిపై తల్లిదండ్రులకు హక్కు లేదా ?
ప్రేమ వివాహాలకు అభ్యంతరం లేదు కానీ ఇలా పెండ్లి చేసుకోవడం వల్ల సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాం ?
ప్రణయ్ విగ్రహం పెట్టడం వల్ల చదువుకోవాల్సిన పిల్లలు చదువుకోకుండా ప్రేమ అంటూ అమ్మాయిల వెంటపడే దుష్ప్రభావం ఏర్పడుతుంది తప్ప అదనపు ప్రయోజనం అంటూ ఏమి ఉండదు కాబట్టి ప్రణయ్ విగ్రహం పెట్టొద్దు , అందుకు మీరు అనుమతి ఇవ్వొద్దు అంటూ వేడుకున్నారు . అయితే మారుతీరావు కి వ్యతిరేకంగా మొదట్లో ఉన్నారు అంతా కొద్దిరోజులు కాగానే ఇప్పుడు ఏకంగా మారుతీరావు కు మద్దతు ప్రకటించడమే కాకుండా ర్యాలీ తీశారంటే …. ఎస్పీ ని కలిశారంటే ఇదేనేమో మార్పు అంటే !

English Title: Maruthi rao supporters held rally in miryalaguda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All