Homeగాసిప్స్నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని చూస్తోన్న మారుతి

నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని చూస్తోన్న మారుతి

నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని చూస్తోన్న మారుతి
నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని చూస్తోన్న మారుతి

దర్శకుడిగా మారుతి సక్సెస్ఫుల్ సినిమాలు బానే తీసాడు. అయితే తన రేంజ్ అనుకున్నంతగా పెరగకపోవడానికి తన ట్రాక్ రికార్డ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ పడగానే వెంటనే మరో ప్లాప్ పడడంతో మారుతి ఎక్కడినుండి మొదలుపెట్టాడో అక్కడికే వస్తున్నాడు. నిజానికి భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతి వెంకటేష్ తో ఆఫర్ అందుకున్నాడు. బాబు బంగారం సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా హిట్ అయ్యుంటే అటు నుండి అటే పెద్ద హీరోల వైపు చూసేవాడేమో కానీ ఆ సినిమా ప్లాప్ అయింది. దాంతో మరో మిడ్ రేంజ్ హీరో శర్వానంద్ తో మహానుభావుడు చేసాడు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈసారి నాగ చైతన్య నుండి కబురు అందింది. అయితే మళ్ళీ అదే తంతు. శైలజారెడ్డి అల్లుడు సినిమా ప్లాపైంది. ఈసారి బాగా గ్యాప్ తీసుకుని సాయి తేజ్ తో ప్రతిరోజూ పండగేను తెరకెక్కించాడు. ఈ చిత్రం ఏ రేంజ్ హిట్ అయిందో మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాయి తేజ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలు అందుకుంది ఈ చిత్రం.

ఈసారి కూడా మారుతి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని చూస్తున్నాడు. అయితే ఈసారి అడ్డంకి వేరే రూపంలో వస్తోంది. ప్రతిరోజూ పండగే రిలీజ్ అవ్వడానికి ముందే మారుతి తన నెక్స్ట్ సినిమాకు కమిటయ్యాడు. దానయ్య కొడుకును లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నాడు. ప్రతిరోజూ పండగే సూపర్ హిట్ అయిన నేపథ్యంలో స్టార్ హీరోలు అడిగితే డేట్లు ఇచ్చే అవకాశముంది. ఇలాంటి సమయంలో కొత్త హీరోతో రిస్క్ ఎందుకని భావిస్తున్నాడు మారుతి. అయితే దానయ్య తన కొడుకుని లాంచ్ చేయడానికి భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్నాడు. మారుతి మార్కెట్ రేటు కంటే రెండింతలు ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఈ పరిస్థితుల్లో స్టార్ హీరో కోసం నెలలకు నెలలు వెయిట్ చేయడం కరెక్టా లేక పారితోషికం కోసం కొత్త హీరో వైపు వెళ్లడం కరెక్టా అన్నది ఆలోచిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All