Homeటాప్ స్టోరీస్కాజ‌ల్ ఎంత సీక్రెట్‌గా దాచేసింది!

కాజ‌ల్ ఎంత సీక్రెట్‌గా దాచేసింది!

కాజ‌ల్ ఎంత సీక్రెట్‌గా దాచేసింది!
కాజ‌ల్ ఎంత సీక్రెట్‌గా దాచేసింది!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు కాజ‌ల్ ఓ వెలుగు వెలిగింది. ప్ర‌స్తుతం హీరోయిన్‌గా మంచి క్రేజ్ వుండ‌గానే త‌న చిర‌కాల మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్‌, సోల్‌మేట్ గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకుంది. గ‌త నెల 30న కాజ‌ల్ – గౌత‌మ్ కిచ్లూల వివాహం ముంబైలోని తాజ్ హోట‌ల్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అయితే తాజాతా ఎల్లో క‌ల‌ర్ డిజైన‌ర‌క్ వేర్ సారీలో కాజ‌ల్‌, వైట్ షేర్వానీలో గౌత‌మ్ కిచ్లూ మ‌రింత క్లోజ్‌గా వున్న ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో కాజ‌ల్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు పెళ్లికి ముందువ‌ని చెప్ప‌డంతో అంతా అవాక్క‌య్యారు. పెళ్లికి ముందే కాజ‌ల్ ఇంత న‌డిపిందా అంటూ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కాజ‌ల్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోలు ఇవ్వ‌ని తెలిసింది.

- Advertisement -

ఇదే విష‌యాన్ని కాజ‌ల్ తాజాగా వెల్ల‌డించింది. జూన్‌లో త‌మ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసింది ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన డివ‌జైన‌ర్ వేర్ సారీని ప్ర‌ముఖ బాలీవుడ్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేశార‌ని తెలిపింది. `నా ప్రియమైన మ‌నీష్ మ‌ల్హోత్రా అందమైన చీరను డిజైన్ చేసినందుకు ధన్యవాదాలు.  జూన్‌లో లాక్డౌన్ కార‌ణంగా చాలా ఇబ్బందికర ప‌రిస్థితులున్నాయి. అలాంటి స‌మ‌యంలో ఇది సాధ్య‌మ‌వుతుందా అని నేను భావించాను కానీ నేను కోరుకున్న సారీని డిజైన్ చేసి నా నిశ్చితార్థంలో మీరు భాగమైనందుకు నిజంగా మిమ్మ‌ల్ని ప్రేమతో అభినందిస్తున్నాను` అని కాజ‌ల్ తెలిపింది. విష‌యం తెలిసిన వాళ్లంతా జూన్‌లో ఎంగేజ్‌మెంట్ జ‌రిగితే కాజ‌ల్ ఎంత సీక్రెట్‌గా దాచేసింది` అని అవాక్క‌వుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All