Homeటాప్ స్టోరీస్కాజ‌ల్ - గౌత‌మ్ కెమిస్ట్రీ అదిరిపోయిందిగా!

కాజ‌ల్ – గౌత‌మ్ కెమిస్ట్రీ అదిరిపోయిందిగా!

కాజ‌ల్ - గౌత‌మ్ కెమిస్ట్రీ అదిరిపోయిందిగా!
కాజ‌ల్ – గౌత‌మ్ కెమిస్ట్రీ అదిరిపోయిందిగా!

స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న చిర‌కాల మిత్రుడు, ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూ ని ఈ శుక్ర‌వారం వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. తను ప్రేమ‌లో వున్న‌నంటూ స‌డ‌న్ షాకిచ్చిన కాజ‌ల్ `య‌స్‌` నేను ప్రేమ‌లో వున్నాను. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించి స‌ర్‌‌‌‌‌‌ప్రైజ్ చేసింది.

లాక్‌డౌన్ టైమ్‌లో టాలీవుడ్ సెల‌బ్రిటీలు పెళ్లి కోసం వ‌రుస‌గా క్యూ క‌డుతున్న‌ట్టే కాజ‌ల్ కూడా శుక్రవారం ముంబైలో తాజ్ హోట‌ల్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. క‌రోనా కార‌ణంగా ఈ పెళ్లిలో ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఈ పెళ్లిలోడిజైన‌ర్ అనామిక డిజైన్ చేసిన లెహెంగాలో త‌ళుకులీనింది. దీని కోసం దాదాపు 20 మంది నెల రోజుల పాటు శ్ర‌మించార‌ట‌.

- Advertisement -

ఇందుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందించిన కాజ‌ల్ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తింది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేసిన కాజ‌ల్ కొత్త పెళ్లికొడుకు గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చిన స్టిల్స్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్ద‌రి కెమిస్ట్రీ చూసిన నెటిజ‌న్స్ హీరో హీరోయిన్‌ల‌ని మించి కాజ‌ల్ – గౌత‌మ్‌ల కెమిస్ట్రీ అదిరింద‌ని అంతా కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All