Homeటాప్ స్టోరీస్భార్య కు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్

భార్య కు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్

Manchu Manoj wishes his love of life wifeభార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆమెపట్ల తనకున్న ప్రేమని వ్యక్తం చేసాడు హీరో మంచు మనోజ్ . ప్రణతి రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆమె పట్ల తనకున్న ప్రేమని తెలియజేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు మంచు మనోజ్ . ప్రణతి రెడ్డి మంచు మనోజ్ వదిన అయిన విరానికా రెడ్డి క్లాస్ మేట్ దాంతో ప్రణతి తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది , కట్ చేస్తే వాళ్ళ ప్రేమకు పెద్దలు ఆశీస్సులు అందజేయడంతో కథ సుఖాంతం అయ్యింది .

అయితే గతకొంతకాలంగా భార్యాభర్తల మధ్య విబేధాలు పొడ చూపాయని ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రావడం సంచలనం సృష్టించింది దాంతో మంచు మనోజ్ స్పందించాడు , నేను నా భార్య హాయిగా ఉన్నాం మేము విడిపోవడం లేదు మా ఆమధ్య చిచ్చు పెట్టకండి అంటూ సోషల్ మీడియా ముందుకు వచ్చాడు . దాదాపు మూడేళ్ళ క్రితం ప్రణతి ని పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్ . హీరోగా స్టార్ డం అందుకోవాలని పదేళ్లుగా సన్నాహాలు చేస్తున్నాడు కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు ఈ హీరో అయితే అందరితో కలివిడిగా ఉండే మంచు మనోజ్ అంటే ఇండస్ట్రీ లో మిగతా హీరోలకు కూడా మంచి అనుబంధం ఉంది .

- Advertisement -

English Title: Manchu Manoj wishes his love of life wife

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All