Monday, March 20, 2023
Homeటాప్ స్టోరీస్ప్రకంపనలు సృష్టిస్తున్నమంచు మనోజ్ ట్వీట్

ప్రకంపనలు సృష్టిస్తున్నమంచు మనోజ్ ట్వీట్

Manchu manoj tweet goes sensationమంచు మనోజ్ ట్వీట్ సోషల్ మీడియాలో అలాగే సినిమారంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది . ఇంతకీ మంచు మనోజ్ చేసిన ట్వీట్ సారాంశం ఏంటో తెలుసా …….. హైదరాబాద్ నుండి తిరుపతికి షిఫ్ట్ అవుతున్నానని , అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పడమే ! మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగుసినీ రంగంలో అడుగుపెట్టిన మనోజ్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు కానీ నటుడిగా సత్తా చూపించాడు . విభిన్న పాత్రలు పోషించాడు అయితే ఇక్కడ సక్సెస్ మాత్రమే ప్రధానం కానీ పేరు ప్రఖ్యాతులు , గొప్ప మనసు, సేవా గుణం ఇలాంటి వన్ని పనికిరావు ముఖ్యంగా సినిమారంగంలో .

- Advertisement -

దాదాపు పుష్కర కాలంగా హీరోగా సక్సెస్ కోసం గట్టిగా ట్రై చేస్తూనే ఉన్నాడు మంచు మనోజ్ కానీ అనుకున్న స్థాయిలో ఏది కూడా వర్కౌట్ కాలేదు దాంతో తను పెరిగి పెద్దైన తిరుపతిలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి హైదరాబాద్ నుండి తిరుపతి కి షిఫ్ట్ అవుతున్నాడు . నేను ఇక్కడి నుండి తిరుపతి కి షిఫ్ట్ అవుతున్నానంటే ఏదో ఏదో ఊహించే వాళ్ళు ఉంటారు అందుకే ముందుగా చెబుతున్నా అక్కడికి కొంతకాలమే వెళుతున్నా , ఈ ప్రపంచంలోని చాలా ప్రదేశాలను చూసాను , ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాను , మళ్ళీ తెలంగాణ కు వస్తాను అంటూ ట్వీట్ చేసి సినిమారంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు మంచు మనోజ్ . అయితే మంచు మనోజ్ కొంత డిప్రెషన్ లో ఉన్నట్లయితే కనబడుతున్నాడు ఈ ట్వీట్ తో .

English Title: Manchu manoj tweet goes sensation

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts