Homeటాప్ స్టోరీస్చెప్పుతో కొడతానంటున్న మంచు లక్ష్మి

చెప్పుతో కొడతానంటున్న మంచు లక్ష్మి

manchu lakshmi fire on social mediaనాపై కానీ నా కుటుంబ సభ్యులపై కానీ అవాకులు చెవాకులు పేల్చే వాళ్ళని చెప్పుతో కొడతానంటోంది నటి , నిర్మాత మంచు లక్ష్మి . సోషల్ మీడియాలో మంచు లక్ష్మి వ్యక్తిత్వం పై అలాగే మంచు కుటుంబం పై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం తెప్పిస్తున్నారు మంచు లక్ష్మి కి . కొంతమంది అయితే అదేపనిగా మంచు లక్ష్మి ని ట్రోల్ చేస్తున్నారు దాంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన మంచు లక్ష్మి అటువంటి వాళ్ళను చెప్పులతో కొడతానని , చంపేస్తానని అంటోంది . సోషల్ మీడియా వల్ల లాభాలతో పాటుగా ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయని ఎవరినీ అనవసరంగా విమర్శించాల్సిన అవసరం లేదని అంటోంది .

నా గురించి కానీ , మా కుటుంబం గురించి కానీ మీకు ఏం తెలుసు ? ఎందుకు మా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారు ? యు ట్యూబ్ లో ఫోటోలను మార్ఫింగ్ చేసి మమ్మల్ని ఎందుకు చులకన చిత్రీకరిస్తున్నారు అంటూ ఆవేశం వెళ్లగక్కింది మంచు లక్ష్మి . మా ఫ్యామిలీ ని ట్రోల్ చేసే వాళ్లంటే నేను సివంగి లా మారతానని నిప్పులు చెరుగుతోంది . మంచు లక్ష్మి ఆవేదనలో నిజం ఉంది , తమకు నచ్చినవాళ్ల ని పొగడటంలో అర్ధం ఉంది అంతేకాని నచ్చని వాళ్ళని అదేపనిగా ట్రోల్ చేయడం భావ్యం కాదు . సోషల్ మీడియాలో ఈ విపరీత ధోరణి ఎక్కువయింది .

- Advertisement -

English Title: manchu lakshmi fire on social media

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All