Homeటాప్ స్టోరీస్మంచు లక్ష్మి కి శుభాకాంక్షల వెల్లువ

మంచు లక్ష్మి కి శుభాకాంక్షల వెల్లువ

viranica reddy best wishes to manchu lakshmiమంచు లక్ష్మి కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి . తాజాగా మంచు లక్ష్మి ” వైఫ్ ఆఫ్ రామ్ ” చిత్రంలో నటించింది కాగా ఆ చిత్రం ఈనెల 20న విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా హిట్ కావాలని ఆశిస్తూ పలువురు మహిళామణులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు . ఇప్పటికే తమిళ హీరో సూర్య , జ్యోతిక విషెష్ చెప్పగా తాజాగా మంచు లక్ష్మి వదిన మంచు విష్ణు భార్య అయిన వెరోనికా రెడ్డి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఓ వీడియో ని పోస్ట్ చేసింది .

వెరోనికా రెడ్డి తో పాటు గా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి కూడా మంచు లక్ష్మి నటించిన వైఫ్ ఆఫ్ రామ్ విజయవంతం కావాలని ఆశిస్తూ విషెస్ చెప్పింది . విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిబొట్ల నిర్మించారు . మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించగా ప్రియదర్శి , ఆదర్శ్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు . హర్రర్, సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వైఫ్ ఆఫ్ రామ్ చిత్రంపై మంచు లక్ష్మి ఎన్నో ఆశలు పెట్టుకుంది . ఇక టీజర్ , ట్రైలర్ లతో ప్రేక్షకుల అటెన్షన్ కొట్టేసిన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే ఈనెల 20 వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -

English Title: viranica reddy best wishes to manchu lakshmi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All