Homeన్యూస్మంచు కురిసే వేళలో రివ్యూ

మంచు కురిసే వేళలో రివ్యూ

manchu kurise velalo review
మంచు కురిసే వేళలో రివ్యూ

మంచు కురిసే వేళలో రివ్యూ :
నటీనటులు : రామ్ కార్తీక్ , ప్రణాళి
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత : హరి బాల సుబ్రహ్మణ్యం
దర్శకత్వం : బాల బోడేపూడి
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 28 డిసెంబర్ 2018

బాల బోడేపూడి దర్శకత్వంలో హరి బాల సుబ్రహ్మణ్యం నిర్మించిన ప్రేమకథా చిత్రం ” మంచు కురిసే వేళలో ”. ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

రేడియో జాకీగా పనిచేసే ఆనంద్ కృష్ణ ( రామ్ కార్తీక్ ) గీత ( ప్రణాళి )ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు . అయితే ఆమెకు తన ప్రేమ విషయం చెప్పేలోపే గీతకు మరొకరితో ఉన్న స్నేహాన్ని గురించి చెప్పి షాక్ ఇస్తుంది . అసలు గీతకు పరిచయమున్న ప్రకాష్ ఎవరు ? ఆనంద్ కృష్ణ తన ప్రేమని గెలుచుకున్నాడా ? గీత – ఆనంద్ లు ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

వైజాగ్ లొకేషన్స్
రామ్ కార్తీక్
ప్రణాళి
చమ్మక్ చంద్ర కామెడీ

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే
ఎడిటింగ్

నటీనటుల ప్రతిభ :

రామ్ కార్తీక్ ఆనంద్ కృష్ణ పాత్రలో లీనమై నటించాడు . ప్రేమికుడిగా భగ్న ప్రేమికుడిగా మంచి నటనని ప్రదర్శించాడు . ప్రణాళి కి కూడా మంచి పాత్ర లభించింది . డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర లభించింది ప్రణాళి కి . చమ్మక్ చంద్ర కామెడీతో ఆకట్టుకున్నాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

హరి బాలసుబ్రహ్మణ్యం నిర్మాణ విలువలు బాగున్నాయి . వైజాగ్ అందాలను తన కెమెరాలో బంధించి విజువల్ గా బాగుండేలా చేసాడు కెమెరామెన్ తిరు జ్ఞాన . శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటల్లో 2 బాగున్నాయి . ఇక దర్శకుడు విషయానికి వస్తే …… ప్రేమకథా చిత్రాన్ని బాగానే రాసుకున్నాడు కానీ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది .

ఓవరాల్ గా : ప్రేమికుల కోసం ఈ మంచు కురిసే వేళలో

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All