Homeన్యూస్మనసా వాచా రివ్యూ

మనసా వాచా రివ్యూ

Manasa Vacha Movie Reviewమనసా వాచా రివ్యూ :
నటీనటులు : తేజస్ , కరిష్మా కార్పల్
సంగీతం : కేశవ్ కిరణ్
నిర్మాత : గణేష్ పాల
దర్శకత్వం : ఎం వి ప్రసాద్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 15 మార్చి 2019

 

- Advertisement -

తేజస్ – కరిష్మా కార్పల్ జంటగా ఆనంద్ దర్శకత్వంలో గణేష్ పాల నిర్మించిన చిత్రం ” మనసా ….. వాచా ” . ఈచిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది చూద్దామా !

కథ 

లండన్ లోని మెడికల్ ఇనిస్టిట్యూట్ లో రీసెర్చ్ స్కాలర్స్ చైతూ (తేజస్ ) , స్వాతి ( కరిష్మా కార్పల్ ) . చైతు కి స్వాతి అంటే ఇష్టం దాంతో ఆమెని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు . ప్రజలను మహమ్మారిలా పట్టిపీడిస్తున్న క్యాన్సర్ ని నివారించే మందు కనుక్కుంటాడు చైతు . అయితే క్యాన్సర్ మందు కనుక్కునే క్రమంలో మెడికల్ మాఫియా గురించి భయంకరమైన విషయాలు తెలుసుకుంటాడు . కట్ చేస్తే చైతు కిడ్నాప్ అవుతాడు . అసలు చైతు ని ఎందుకు కిడ్నాప్ చేసారు ? ఎవరు చేసారు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

తేజస్

కరిష్మా కార్పల్

సినిమాటోగ్రఫీ

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

తేజస్ – కరిష్మా కార్పల్ జంట బాగుంది , కొత్తవాళ్లు అయినప్పటికీ నటనలో ఎక్కడ ఆ బెరుకు కనిపించలేదు . తమ తమ పాత్రల్లో మెప్పించారు ఇద్దరు కూడా . ఇక తాగుబోతు శ్రీను బాగా నవ్వించాడు . జబర్దస్త్ నవీన్ కూడా తన పాత్రకు న్యాయం చేసాడు .

సాంకేతిక వర్గం :

విజువల్స్ బాగున్నాయి , నిర్మాత ఖర్చుపెట్టిన దాన్ని తెరమీద కనిపించేలా చేసి ఆకట్టుకున్నాడు . కేశవ్ కిరణ్ అందించిన పాటలు అలాగే నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి . నిర్మాణ విలువలు బాగున్నాయి , ఇక దర్శకుడు విషయానికి వస్తే ….. విభిన్న కథావస్తువుని ఎంచుకున్న ఎం వి ప్రసాద్ ని నిజంగా అభినందించాల్సిందే . బర్ణింగ్ ఇష్యు ని టచ్ చేసి ప్రేక్షకులను ఆలోచింపజేసేలా చేసాడు దర్శకుడు . పాత్రలకు తగ్గ నటీనటులను ఎంచుకొని వాళ్ళ నుండి సరైన నటన రాబట్టుకొని సక్సెస్ అయ్యాడు .

ఓవరాల్ గా :

విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ మనసా వాచా ని తప్పకుండా ఓసారి చూడొచ్చు .

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All