Homeటాప్ స్టోరీస్ఫొటో స్టోరీ : గిరిజ‌న యువ‌తిగా అందాల విందు!

ఫొటో స్టోరీ : గిరిజ‌న యువ‌తిగా అందాల విందు!

ఫొటో స్టోరీ : గిరిజ‌న యువ‌తిగా అందాల విందు!
ఫొటో స్టోరీ : గిరిజ‌న యువ‌తిగా అందాల విందు!

అవ‌కాశాల కోసం మేక‌ర్ ల‌కు వ‌ల వేసే హీరోయిన్‌లు హాట్ ఫొటోషూట్‌ల‌ని న‌మ్ముకుంటున్న విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ ఫొటోల‌ని వైర‌ల్ చేస్తూ క్రేజ్‌ని సొంతం చేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో మేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షిస్తూ క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటున్నారు. కానీ మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్‌ మాత్రం ఎంత గ్లామ‌ర్ షో చేసినా ఆ స్థాయిలో మాత్రం ఆఫ‌ర్ల‌ని పొంద లేక‌పోతోంది.

ప్ర‌ముఖ  సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు. మోహ‌న‌న్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌తో పాటు, కోలీవుడ్‌లోనూ కె.యు. మోహ‌న‌న్‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా మంచి పేరుంది. ఆ పేరుకు త‌గ్గ‌ట్టే అవ‌కాశాల్ని ద‌క్కించుకోవాల‌ని మాళ‌వికా మోహ‌న‌న్ ప్ర‌య‌త్నాలు చేసినా  ఆశించిన స్థాయిలో మాత్రం అవ‌కాశాల్ని ద‌క్కించుకోలేక‌పోతోంది. ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగా న‌టిస్తున్న త‌మిళ చిత్రం `మాస్టర్‌`లో న‌టిస్తున్న మాళ‌విక తాజాగా ట్రైబ‌ల్ యువ‌తి వేష‌ధార‌ణ‌లో వ‌గ‌లు పోతూ హాట్ హాట్ ఫొటో షూట్‌కు పోజులిచ్చింది.

- Advertisement -

‌గిరిజ‌న యువ‌తి వ‌స్త్ర ధార‌ణ‌లో మ‌ళ‌వికా మోహ‌న‌న్ ఇచ్చిన పోజులు సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఈ ఫొటో షూట్‌తో అయినా మాళ‌విక మ‌రిన్ని క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటుందో చూడాలి అంటున్నారు. అన్న‌ట్టు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి మాళ‌విక మోహ‌న‌న్ న‌టించ‌నున్న `హీరో` చిత్రం మ‌ధ్య‌లో ఆగిపోయిందంటూ వార్త‌లు వినిపించాయి. దీనికిపై ఇంత వ‌ర‌కు మైత్రీ సంస్థ స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All