Sunday, September 25, 2022
Homeగాసిప్స్బాల‌య్య‌ను టెన్ష‌న్‌ పెడుతున్న విల‌న్‌?

బాల‌య్య‌ను టెన్ష‌న్‌ పెడుతున్న విల‌న్‌?

బాల‌య్య‌ను టెన్ష‌న్‌ పెడుతున్న విల‌న్‌?
బాల‌య్య‌ను టెన్ష‌న్‌ పెడుతున్న విల‌న్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం ఇటీవ‌లే పునః ప్రారంభం అయిన విష‌యం తెలిసిందే. ఊర మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. గ‌త ఎనిమిది నెల‌ల విరామం త‌రువాత ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది.

- Advertisement -

ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి బాల‌య్య – బోయ‌పాటి క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఇందులో ఓ పాత్ర అఘోరా క్యారెక్ట‌ర్ అన్న‌ది తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీలో ప్రధాన విల‌న్ ఇంకా ఫైన‌ల్ కాక‌పోవ‌డంతో బాల‌య్య‌తో పాటు బోయ‌పాటికి ఈ అంశం త‌ల‌నొప్పిగా మారింద‌ట‌.

ముందు ఈ పాత్ర కోసం సంజ‌య్‌ద‌‌త్‌ని అనుకున్నారు. కానీ సంజ‌య్‌ భారీ మొత్తం కోట్ చేయ‌డంతో అత‌ని స్థానంలో సోనుసూద్ ని సంప్ర‌దించారు. సోనూ కూడా భారీగా పారితోషికం డిమాండ్ చేశార‌ట‌. దీంతో అత‌న్ని ప‌క్క‌న పెట్టారు. ఓ వీల‌న్‌గా హీరో శ్రీ‌కాంత్ ని ఫైన‌ల్ చేసుకున్నా ప్ర‌ధాన విల‌న్ మాత్రం ఇంకా క‌న్ఫ‌మ్ కాక‌పోవ‌డంతో హీరో బాల‌య్య‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ట‌.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts