Homeటాప్ స్టోరీస్ఆ హీరో వల్ల కెరీర్ నాశనమైందంటున్న భామ

ఆ హీరో వల్ల కెరీర్ నాశనమైందంటున్న భామ

mahi gill sensational comments on salman khanబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వల్ల నా కెరీర్ సర్వ నాశనం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ భామ మహి గిల్ . దబాంగ్ సినిమాలో సల్మాన్ హీరో కాగా ఆ చిత్రంలో నేను కూడా నటించానని , సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించడం అంటే చాలా ఇబ్బంది పడాల్సిందే అందుకే ఎవరూ సాహసం చేసి నటించరు కానీ నేను మాత్రం ధైర్యం చేసి నటించాను దాంతో నాకు కెరీర్ లేకుండా పోయింది అదంతా సల్మాన్ ఖాన్ వల్లే అంటూ కండల వీరుడిపై ఆరోపణలు చేస్తోంది మహి గిల్ .

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ సల్మాన్ ఖాన్ తో నటించిన తర్వాత అన్ని చిన్న చిన్న పాత్రలు , అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు వస్తుండటంతో వాటిని తిరస్కరించిందట ! ఇంకేముంది ఆ చిన్న పాత్రలు కూడా రావడం లేదట ఇప్పుడు దీనికంతటికి కారణం సల్మాన్ అని లేకపోతే ఖచ్చితంగా నా కెరీర్ మరోలా ఉండేదని అంటోంది మహి గిల్ . నా కెరీర్ ఇలా అర్దాంతరంగా ముగిసిపోవడంతో చాలా బాధపడ్డాను ,నా ప్రాప్తం ఇంతేనేమో అందుకే ఇలా జరిగింది అంటూ నిట్టూర్పు విడుస్తోంది మహి గిల్ .

- Advertisement -

English Title: mahi gill sensational comments on salman khan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All