
టాలీవుడ్ హీరోలకు సంబంధించిన వ్యానిటీ వ్యాన్‌లు (కారవాన్)లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా తన కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో ఓ వ్యానిటీ వ్యాన్‌ని సిద్ధం చేయించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల `పుష్ప` షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లిన ఈ కారవాన్‌కు తిరిగి వస్తుండగా ఖమ్మం సమీపంలో యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే సూపర్‌స్టార్ మహేష్ కూడా ప్రత్యేకంగా ఓ వ్యానిటీ వ్యాన్‌ని రెడీ చేయించుకున్నారు. ఇటీవలే దీన్ని బయటి నుంచి తెప్పించుకున్నారు. ఈ వ్యాన్ ఖరీదు అక్షరాల 8 కోట్లు అని తెలిసింది. ఇదే వ్యాన్ ఇటీవల సందీప్ వంగ కమర్షియల్ యాడ్ షూట్ సమయంలో పలువురిని ఆకర్షించింది. దీని ఖరీదు బాలీవుడ్ బాద్‌షా వ్యానిటీ వ్యాన్ కన్నా ఖరీదు ఎక్కువేనని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
అయితే ముందు ఆ్యనిటీ వ్యాన్ ఖరీదు 6.25 కోట్లేనట. అయితే దాన్ని మరింత సుందరంగా మలచడం కోసం పూనే బేస్డ్ ఆటో మొబైల్ కంపనీకి ఇంటీరియర్ డెకరేషన్ కోసం దాదాపు మహేష్ 2 కోట్ల వరకు ఖర్చే చేశారట. దాంతో మహేష్ వ్యానిటీ వ్యాన్ ఇండియాలో వున్న స్టార్ హీరోల వ్యానిటీ వ్యాన్‌లలో అత్యంత ఖరీదైనదిగా నిలిచినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.