HomeVideosమ‌హేష్ వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా?

మ‌హేష్ వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా?

మ‌హేష్ వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా?
మ‌హేష్ వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా?

గత వారం కింగ్ నాగార్జున న‌టిస్తున్న ` వైల్డ్ డాగ్` ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ట్రైల‌ర్ రిలీజ్ అనంత‌రం చిరుతో జ‌రిపిన వాట్సాప్ చాట్‌ని, ఆ త‌రువాత ట్రైల‌ర్ గురించి మ‌హేష్‌తో జ‌రిపిన చిట్ చాట్‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. అంతటితో ఆగ‌క చిరు తో చాట్ చేసిన స్క్రీన్ షాట్‌ని, మ‌హేష్‌తో చాట్ చేసిన స్క్రీన్ షాట్‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీంతో ఈ మూవీకి ఇద్ద‌రు ఫ్యాన్స్ నుంచి మంచి స్పంద‌న ల‌భించింది.

ఆ సంభాషణలలో ట్రైలర్ కట్ చాలా ఆసక్తికరంగా, ఉత్సుకతను సృష్టించేలా వుంద‌ని చిరు చెప్పగా,  అద్భుతంగా వుంద‌ని మహేష్ తెలిపారు. దీనికి సంబంధించిన‌ స్క్రీన్ షాట్ ల‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలా అని నాగ్ మహేష్‌ను అడిగాడు..సూపర్ స్టార్ అందుకు `తప్పకుండా` అని సమాధానం ఇచ్చాడు. ఇక్క‌డ ఓ విష‌యం బ‌య‌టికి వ‌చ్చంది. త‌మ అభిమాన‌ స్టార్ మ‌హేష్ వాట్సాప్ డీపీ ఎలా వుంటుంద‌న్న‌ది ఆయ‌న అభిమానుల‌కు తెలిసిపోయింది.

- Advertisement -

మ‌హేష్ త‌న వాట్సాప్ డీపిగా గ‌ర్జిస్తున్న ల‌య‌న్ ఫొటోని పెట్టుకున్నారు. ఇదే విష‌యం నాగ్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ వ‌ల్ల బ‌య‌టికి రావ‌డంతో మ‌హేష్ ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డుతున్నారు. నాగ్ వ‌ల్ల త‌మ అభిమాన హీరో వాట్సాప్ డీపీ ఏంటో తెలిసింద‌ని తెగ సంబ‌ర‌ప‌డుతున్నారు. ఇక్క‌డ మ‌రో గ‌మ్మ‌త్తైన విష‌యం బ‌య‌టకి వ‌చ్చింది. మ‌హేష్ నంబ‌ర్‌ని `Mahesh Actor` అని, చిరు నంబ‌ర్‌ని `Chiranjeevi Pvt` అని నాగ్ పెట్టుకోవ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All