Homeటాప్ స్టోరీస్వెన్నుపోటు పొడిచిన మహేష్ బాబు

వెన్నుపోటు పొడిచిన మహేష్ బాబు

Mahesh unhappy with MAA electionsమహేష్ బాబు కూడా రాజకీయాలను బాగానే వంట బట్టించుకున్నాడు అందునా వెన్నుపోటు రాజకీయాలను . తాజాగా సీనియర్ నటుడు  నరేష్ కు ఓటు వేయకుండా వెన్నుపోటు పొడిచాడు మహేష్ బాబు . విజయనిర్మల తనయుడైన నరేష్ మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే . ఆ ఎన్నికల సందర్బంగా మార్చి 10 ఆదివారం రోజున  పోలింగ్ జరిగింది అయితే మహేష్ బాబు మాత్రం పోలింగ్ కు రాలేదు ఓటు వేయలేదు .

 

- Advertisement -

మా ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ నరేష్ ప్యానల్ పోటీ పడ్డాయి , అయితే శివాజీరాజా ప్యానల్ కు చిరంజీవి మద్దతు ఉందన్నది బహిరంగ రహస్యమే ! దాంతో నరేష్ మహేష్ బాబు మద్దతు కూడగట్టడం కోసం ప్రయత్నం చేసాడు . మహేష్ బాబు కూడా నరేష్ కు మద్దతు ప్రకటించాడు . అయితే ఎన్నికలు దగ్గర పడిన సమయంలో శివాజీరాజా ప్యానల్ పై నరేష్ ప్యానల్ విరుచుకుపడడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దాంతో మా ఎన్నికలు రచ్చ రచ్చ అయ్యాయి . ఇంకేముంది ఈ వ్యవహారం అంతా నచ్చని మహేష్ బాబు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు . మహేష్ వచ్చి ఓటు వేస్తాడు గెలిపిస్తాడు అని ఆశించిన నరేష్ కు భంగపాటు తప్పలేదు . అయితే మహేష్ బాబు ఓటు వేయకపోయినప్పటికీ నరేష్ గెలవడం విశేషం .

English Title : Mahesh unhappy with MAA elections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All