
సూపర్ స్టార్ మహేష్ బాబు వరసగా ప్రామిసింగ్ చిత్రాలని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నాడు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే దుబాయ్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ఉంటుంది. వచ్చే నెల నుండి షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అక్టోబర్ కల్లా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలన్నది ప్లాన్.
ఇక సర్కారు వారి పాట పూర్తైన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరోసారి జట్టుకట్టనున్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ముందుగా ఇందులో మహేష్ పాత్ర స్పై తరహాలో ఉంటుందని అనుకున్నారు కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ అండర్ కవర్ కాప్ గా కనిపించనున్నాడట.
పోకిరి చిత్రంలో అండర్ కవర్ గా కనిపించిన మహేష్ రికార్డులను తిరగరాశాడు. మరి ఈసారి ఏం చేయబోతున్నాడో.