Homeటాప్ స్టోరీస్సర్కారు వారి పాట డెసిషన్ మహేష్ చేతుల్లోనే

సర్కారు వారి పాట డెసిషన్ మహేష్ చేతుల్లోనే

సర్కారు వారి పాట డెసిషన్ మహేష్ చేతుల్లోనే
సర్కారు వారి పాట డెసిషన్ మహేష్ చేతుల్లోనే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో ఒక భారీ షెడ్యూల్ జరిగింది. సెకండ్ షెడ్యూల్ మొదలైనా కూడా కొన్ని రోజులకే క్రూ మెంబర్స్ కరోనా పాజిటివ్ టెస్ట్ అవ్వడంతో షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. తిరిగి జూన్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టాలనుకుంటున్నారు కానీ కచ్చితంగా ఎప్పటినుండి అంటే క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో మహేష్ చేతిలోనే తుది నిర్ణయం ఉన్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట వీడియో గ్లిమ్ప్స్ ను కట్ చేసి మహేష్ కు పంపిస్తారట. అది చూసి మహేష్ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటాడట.

- Advertisement -

పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All