
లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలు ఇంటి పట్టునే వున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వర్కవుట్లతో పాటు నచ్చిన సినిమాలు, ఆన్ లైన్ గేమ్‌లతో ఎంజాయ్ చేస్తే టైమ్‌ని గడిపేశారు. ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అదే తరహా వాతావరణం వెంటాడుతోంది. వినోదం కోసం స్టార్స్ నెట్‌ఫ్లిక్స్‌లతో పాటు ఆన్ లైన్ లో ఓటీటీలని ఆశ్రయిస్తూ తమకు నచ్చిన హాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు.
తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రం `ది సోషల్ డైలమా`. సోషల్ మీడియాలో ఈ చిత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీని చూసిన చాలా మంది సెలబ్రిటీలు ఈ చిత్రంపై తమ వ్యూని వ్యక్త పరుస్తున్నారు. ఇటీవల ఈ మూవీని చూసిన మహేష్ కూడా తన అభిప్రాయాన్ని నెటిజన్స్‌తో షేర్ చేసుకున్నారు. `నేను చయాలా హార్రర్ చిత్రాలు చూశాను. హారర్ జోనర్ చిత్రాలకు ఫ్యాన్‌ని. అయితే నెట్‌ప్లిక్స్‌లో నేను చూసిన `సోషల్ డైలమా` అవన్నీంటిని మించి అత్యంత భయంకరమైనది. ఇప్పటికీ ఇది వెన్నులో వణుకు పుట్టిస్తూనే వుంది` అని ఇన్‌స్టా వేదికగా సినిమా పోస్టర్‌ని షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహేష్.
దీంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహేష్‌కు వెన్నులో వణుకు పుట్టించేలా వుందంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే అంటూ చాలా మంది కామెంట్‌లు చేస్తున్నారు. `సోషల్ డైలమా` చిత్రంపై ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో సర్వత్రా `సోషల్ డైలమా` చిత్రంపై చర్చ మొదలైంది