Homeటాప్ స్టోరీస్సూర్య సినిమాకు మ‌హేష్ ప్ర‌శంస‌లు!

సూర్య సినిమాకు మ‌హేష్ ప్ర‌శంస‌లు!

సూర్య సినిమాకు మ‌హేష్ ప్ర‌శంస‌లు!
సూర్య సినిమాకు మ‌హేష్ ప్ర‌శంస‌లు!

వెర్స‌టైల్ స్టార్ సూర్య హీరోగా న‌టించిన తాజా చిత్రం `ఆకాశం నీ హ‌ద్దురా`. సుధా కొంగ‌ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ స్ఫూర్తితో ఈ మూవీని రూపొందించారు. రీసెంట్‌గా దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ మూవీపై అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌, లేడీ డైరెక్ట‌ర్ నందినిరెడ్డి, రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల ఈ మూవీ చూసి హీరో సూర్య‌, డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తాజాగా ఈ మూవీని సూప‌ర్‌స్టార్ మ‌హేష్ అభినందించ‌డ‌మే కాకుండా సూర్య‌, సుధా న‌ట‌న‌పై ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు కురిపించారు. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా చిత్ర బృందాన్ని అభినందించారు.

- Advertisement -

`సూర‌రాయి పోట్రు` చాలా ఉత్తేజకరమైన చిత్రం. అద్భుతమైన ప్రదర్శనలతో అద్భుతంగా దర్శకత్వం వహించారు… సూర్య మీ పెర్ఫార్మెన్స్ టాప్‌లో నిలిచింది బ్ర‌ద‌ర్ అ‌ని మహేష్ ట్వీట్ చేశారు. దీంతో  మహేష్ ఈ చిత్రాన్ని ఎంతగా ఇష్టపడ్డారో అర్థ‌మౌతోంది.  ముఖ్యంగా సూర్య న‌ట‌న‌ని ప్ర‌త్యేకంగా గుర్తు చేస్తూ అభినందించ‌డం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌యం. మ‌హేష్‌ ట్వీట్‌కి సూర్య వెంట‌నే స్పందించారు. మ‌హేష్ స్పందిన తీరుకు మురిసిపోయ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All