
నటీనటులు : సూర్య, అపర్ణా బాలమురళి, మోహన్‌బాబు, పరేష్ రావెల్, ఊర్వశి, కరుణాస్ తదితరులు నటించారు.
దర్శకత్వం: సుధా కొంగర
నిర్మాత : సూర్య, గుణీత్ మోంగా
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
సినిమాటోగ్రఫి : నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్ : సతీష్ సూర్య
ఓటీటీ రిలీజ్ : అమెజాన్ ప్రైమ్
రిలీజ్ డేట్ : 12- 11- 2020
రేటింగ్ : 3.25/5
విలక్షణమైన చిత్రాలకు, విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో సూర్య. గత కొంత కాలంగా సక్సెస్‌ని సొంతం చేసుకోలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ట్రాక్ తప్పారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. మళ్లీ ప్రయోగాత్మక సినిమాతో ట్రాక్‌లోకి రావాలని సూర్య చేసిన సాహసం `సూరరాయిపోట్రు`. ఇదే చిత్రాన్ని తెలుగులో `ఆకాశమే నీహద్దురా` పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని `గురు` ఫేమ్ సుధా కొంగర తెరకెక్కించారు. వ్యవ ప్రయాసలకోర్చి హీరో సూర్య నటించి నిర్మించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా? హీరో సూర్యని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చిందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.కథ:
చంద్రమహేష్ అలియాస్ మహా ( సూర్య) ఓ సాధారణ మధ్యతరగతి స్కూల్ మాస్టారు కొడుకు. తండ్రిమీద కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయి ఎయిర్ ఫోర్స్‌లో చేరతాడు. విమానయానం ధనవంతులకే కాదు సాధారణ ప్రజలకు కూడా అని బలంగా వాధించి తక్కువ ధరకే విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతాయి. దీంతో తన ఐడియాని ఇండియాలోనే టాప్ వన్ ఏయిర్‌వేస్ అధినేత పరేష్ గోస్వామి ( పరేష్ రావెల్)కి చెబుతాడు. పరేష్ గోస్వామి మహా ఐడియాని తిరస్కరించడమే కాకుండా అతని కల నిజం కాకుండా అడుగడుగునా అడ్డుపడతాడు. ఈ సమరంలో మహా తన కలని నిజం చేసుకున్నాడా? అతి తక్కేవ ధరకే సామాన్యులకు విమాన సేవలు అందించాలన్న అతని కల నెరవేరిందా? .. డెక్కన్ ఎయిర్‌ని మహా ఎలా స్థాపించాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన కథ.
నటీనటుల నటన:
ఇది ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి. ఆర్ గోపీనాథ్ జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కిన బయోపిక్ అనుకోవచ్చు. ఇలాంటి కథ సూర్యకిపడితే ఎలా వుంటుందన్నది ఊహించుకోవచ్చు. విభిన్నమైన కథలతో సరికొత్త పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తున్న సూర్య ఈ మూవీలో మహా పాత్రలో ఒదిగిపోయాడు అనడం కంటే జీవించాడు అనడం కరెక్టేమో. `అర్జున్‌రెడ్డి` సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర భావోద్వేగాల్ని చూస్తున్న ప్రేక్షకుడు ప్రతీ క్షణం ఫీలవుతుంటాడు. ఈ మూవీలో సూర్య పాత్ర చూస్తున్పంత సేపు ప్రతీ ఆడియన్ సూర్య భావోద్వేగాలని ఫీలవుతుంటాడు. ఏడిస్తే ఏడ్చి.. నవ్వితే నవ్వి..డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ చేసి ఆ పాత్రని ఓన్ చేసుకుంటాడు. అంత అద్భుతంగా ఈ పాత్రని సూర్య రక్తకట్టించయి హృదయాల్ని టచ్ చేశాడని చెప్పొచ్చు. చాలా రోజుల తరువాత సూర్య నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమా ఇది. ఇక హీరోయిన్‌గా నటించిన అపర్ణ బాలమురళి తన పాత్రని పర్‌ఫెక్ట్‌గా పోషించింది. మిగతా కీలక పాత్రల్లో కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు మరోసారి ఆడుకున్నారు. పరేష్‌రావల్ ఊర్వశి, కరుణాస్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
రియలిస్టిక్ అప్రోచ్‌తో సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిత్రాన్ని ఎంచుకున్నందుకు ముం్దు లేడీ డైరెక్టర్ సుధా కొంగర గట్స్‌కి, ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఏ చిన్న పొరపాటు జరిగినా.. స్టోరీ డీవియేట్ అయినా ఫలితం దారుణంగా వుంటుంది. అందుకే ఆమె ఈ మూవీకి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా జాలా కేర్ తీసుకుని పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఆమె పడిన శ్రమ తెరపై కనిపించింది. కీలక ఘట్టాల కోసం రియల్ లొకేషన్‌లలో ఏయిర్ ఇండియా అథారిటీస్ అనుమతి పొంది మరీ షూట్ చేశారు. అంటే సినిమా ఎంత రియలిస్టిక్‌గా వుంటే అంతా బాగా ఆడియన్‌కి కనెక్ట్ అవుతుందని ఆమె బలంగా నమ్మి ఈ మూవీ చేశారు. మెయిన్ క్రెడిట్ ఆమెకే దక్కినా ఆ ఆలోచనని తెరపైరకి తీసుకురావాలన్న సాహసానికి పూనుకున్న సూర్యకు నిజంగా హ్యాట్సాఫ్. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న సూర్య ఈ సినిమా విషయంలో డూ ఆర్ డై అనే పంథాని అనుసరించి ముందుకు సాగడం నిజంగా అభినందించదగ్గ విషయం. తెరపై మహా తన కలని నిజం చేసుకోవడానికి శ్రమించారో ఓ నిర్మాతగా ఈ మూవీని బయటికి తీసుకురావడానికి హీరో సూర్య అంతే శ్రమించారని చెప్పొచ్చు. ఇక ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ నిఖిత్ బొమ్మిరెడ్డి అందించిన ఫొటోగ్రఫీ హైలైట్‌గా నిలిచింది. జివీ ప్రకాష్‌కుమార్ అందించిన నేపథ్య సంగీతం… సతీష్ సూర్య ఎడిటింగ్ బాగుంది. అయితే ఇంకా మరింత షార్ప్‌గా వుంటే బాగుండేది. సూర్య, గుణీత్ మోంగా నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
సూర్య కెరీర్‌లో మరో మర్చిపోలేని సినిమా ఇది. అతని నటన ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అని చెప్పొచ్చు. రియలిస్టిక్ గా సుధా కొంగర సినిమాని నడిపించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రతీ విషయంలో కేర్ తీసుకున్న సుదా కొంగర సెకండాఫ్‌ని నడిపించే తీరులోనూ మరింత జాగ్రత్తలు పాటించి వుంటే సినిమా స్థాయి మరో రేంజ్‌లో వుండేది. సెండ్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాలు మరీ సాగదీతగా వున్నాయి. సమస్యలు తీరుతున్నా కొద్దీ మళ్లీ మళ్లీ రావడం కొంత విసుగుపుట్టిస్తుంది. కానీ సూర్య నటనతో దాన్ని ఓవర్ కమ్ చేశాడు. ఓ స్ఫూర్తివంతమైన కథని అంతే అద్భుతంగా తెరకెక్కించిన తీరు సూర్య ఫ్యాన్స్ నే కాకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. యాదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన రియాలిస్టిక్ మూవీ కావడంతో ప్రతీ ఒక్కరు ఈజీగా సూర్య ఫీలింగ్స్‌తో.. సినిమాతో కనెక్ట్ అయిపోతారు. ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ మూవీని చూడాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్ ఈ మూవీ. ఓవరాల్‌గా చెప్పాలంటే `ఆకాశం నీ హద్దురా` ప్రేక్షకులు మెచ్చే ఓ ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు.
