Homeటాప్ స్టోరీస్తొలిసారి ఆ ఫొటో షేర్ చేసిన మ‌హేష్!

తొలిసారి ఆ ఫొటో షేర్ చేసిన మ‌హేష్!

తొలిసారి ఆ ఫొటో షేర్ చేసిన మ‌హేష్!
తొలిసారి ఆ ఫొటో షేర్ చేసిన మ‌హేష్!

ఫ్యాన్స్‌, అభిమాన సంఘాల మ‌ధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా స్టార్ హీరోల మ‌ధ్య మాత్రం మంచి స‌న్నిహిత సంబంధాలుంటాయి. అన్న‌దానికి నిద‌ర్శ‌నంగా టాలీవుడ్‌లో చాలా సంఘ‌న‌ట‌లు చోటుచేసుకున్నాయి. అలాగే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌బాబు మ‌ధ్య కూడా అలాంటి అనుబంధమే వుంది. గ‌త కొన్నేళ్ల క్రితం విడుద‌లైన `అర్జున్` చిత్రం వ‌రంగల్‌లో పైర‌సీకి గురైంది. మ‌హేష్ బాబు న‌టించగా ర‌మేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

గుణ‌శేఖ‌ర్ రూపొందించిన ఈ చిత్రం పైర‌సీకి గురి కావ‌డంతో మ‌హేష్‌కి అండ‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ త‌ప్ప ఏ హీరో మ‌హేష్‌ని ఏ హీరో స‌పోర్ట్ చేయ‌డానికి ముందు రాలేదు. తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ నాటి ఫొటోని మ‌హేష్ షేర్ చేస్తూ బ‌ర్త్‌డే విషెస్ చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, పవన్‌కళ్యాణ్ ! మీ దయార్ధ హృద‌యం మరియు వినయం ఎల్లప్పుడూ మార్పును ప్రేరేపిస్తాయి. మంచి ఆరోగ్యం మరియు ఆనందం ఎల్లప్పుడూ ఆ దేవుడు మీకు అందించాల‌ని` అంటూ విష్ చేసిన మ‌హేష్ ఆనాటి ఫొటోని తొలి సారి షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

ఈ ట్వీట్‌ని చూసిన పీకే ఫ్యాన్స్ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. తొలి సారి స్టార్ హీరో మ‌హేష్ త‌న‌కు స‌పోర్ట్‌గా నిలిచిన ప‌వ‌న్ కల్యాణ్ ఫొటోని షేర్ చేస్తూ విషెస్ చెప్ప‌డం ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్‌లో కొత్త బంధాన్ని, స‌రికొత్త స్నేహాన్ని చిగురింప‌జేసింద‌నే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All