Homeటాప్ స్టోరీస్మహేష్ - త్రివిక్రమ్ సర్ప్రైజ్ కు సిద్ధమా?

మహేష్ – త్రివిక్రమ్ సర్ప్రైజ్ కు సిద్ధమా?

మహేష్ - త్రివిక్రమ్ సర్ప్రైజ్ కు సిద్ధమా?
మహేష్ – త్రివిక్రమ్ సర్ప్రైజ్ కు సిద్ధమా?

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మే 31కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయముంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏడాది మహేష్ సినిమా విశేషాలు బయటకు వస్తుంటాయి. అందుకే మహేష్ అభిమానులు 31 గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతేడాది మే 31 సందర్భంగా సర్కారు వారి పాట సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. ఇప్పుడు దానికి తోడు మరో సర్ప్రైజ్ ఉంది. కొన్ని రోజుల క్రితమే మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో సినిమాను ప్రకటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండడంతో మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీ. ఈ సినిమా టైటిల్ ను మే 31న అనౌన్స్ చేస్తారని ఇప్పుడు తెలిసింది.

- Advertisement -

సర్కారు వారి పాట షూటింగ్ పూర్తవ్వగానే మహేష్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All