
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి 11 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు, ఖలేజా ఎంతటి కల్ట్ స్టేటస్ ను సంపాదించాయో మనకు తెలుసు. ఇప్పటికీ ఈ రెండు చిత్రాలు మనకు ఫెవరెట్స్.
ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రూపొందనున్న ఈ హ్యాట్రిక్ చిత్రం కూడా ఫ్యామిలీ అంశాలు కలిసి ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది. కథ ప్రకారంగా షూటింగ్ ఎక్కువగా యూకేలోనే జరుగుతుందిట. దీనివల్ల షూటింగ్ కొంత ఆలస్యం కూడా అవుతుందని అంటున్నారు.
మాములుగా అయితే వచ్చే నెలలో షూటింగ్ ను మొదలుపెట్టాలి కానీ అది ఇప్పుడు జరిగేలా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది.