
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోంది . కాగా ఆన్ లొకేషన్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహేష్ బాబు లుక్ లీక్ అయ్యింది . ఆర్మీ గెటప్ లో ఉన్న మహేష్ బాబు అదిరిపోయేలా ఉన్నాడు . ఈ పిక్ లో మహేష్ బాబు తో పాటుగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు . ఆన్ లొకేషన్ స్టిల్ లీక్ కావడంతో ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనిల్ రావిపూడి , కాగా అతడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది సరిలేరు నీకెవ్వరు చిత్రం . మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండగా మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది . ఇక సీనియర్ నటి విజయశాంతి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది . 2020 లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సరిలేరు నీకెవ్వరు బృందం .