Homeటాప్ స్టోరీస్మహేష్ మల్టీప్లెక్స్ లకు అడ్డంకులు తొలిగాయ్

మహేష్ మల్టీప్లెక్స్ లకు అడ్డంకులు తొలిగాయ్

Mahesh babu AMB cinemas opening on dec 2nd మహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే . ఏషియన్ సునీల్ తో కలిసి కొండాపూర్ – కొత్తగూడ లోని బొటానికల్ గార్డెన్ పక్కన అధునాతన వసతులతో ఏ ఎం బి సినిమాస్ నిర్మించాడు . ఈ మల్టీప్లెక్స్ ని గత నెలలో ప్రారంభించాలని అనుకున్నారు , కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈనెల 29 న అనుకున్నారు కానీ అప్పుడు కూడా కుదరలేదు అయితే ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి డిసెంబర్ 2 న ఏ ఎం బి సినిమాస్ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది . మొత్తం ఏడు స్క్రీన్ లున్నాయి ఇందులో . కాగా అన్ని కూడా అధునాతనమైన వసతులతో ఏర్పాటు చేసారు .

సాఫ్ట్ వేర్ రంగం తో పాటుగా రిచ్ పీపుల్ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో తప్పకుండా ఏ ఎం బి సినిమాస్ కు బ్రహ్మాండమైన ఆదరణ లభించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . మహేష్ బాబు సంపాదన ని వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది నమ్రత . ఇప్పటికే పలు ఏరియాల్లో భూములను , భవంతులను కొన్నది నమ్రత . ఇక ఇప్పుడేమో మల్టీప్లెక్స్ తో హడావుడి చేయనున్నాడు మహేష్ బాబు .

- Advertisement -

English Title: Mahesh babu AMB cinemas opening on dec 2nd

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All