Homeగాసిప్స్సంక్రాంతి హీరోలు వెయిట్ చేయక తప్పట్లేదు

సంక్రాంతి హీరోలు వెయిట్ చేయక తప్పట్లేదు

సంక్రాంతి హీరోలు వెయిట్ చేయక తప్పట్లేదు
సంక్రాంతి హీరోలు వెయిట్ చేయక తప్పట్లేదు

సినిమా వ్యవహారాలు అన్నీ కరోనా వైరస్ కారణంగా మూడు నెలలకు పైగా నిలిచిపోయాయి. వేలాది మంది సినీ కార్మికులు పని లేక, జీతాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు, పడుతున్నారు. అయితే జూన్ 15 నుండి షూటింగ్ లకు అనుమతులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో సినీ కార్మికుల మొహాల్లో మళ్ళీ ఆనందం వెల్లివిరిసింది.

మూడు నెలల నుండి ఆగిపోయిన సినిమా షూటింగ్ లు మళ్ళీ ప్రభుత్వం విధించిన నిబంధనల ఆధారంగా షూటింగ్ చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. అయితే సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ లు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లకు మాత్రం వెయిటింగ్ తప్పేలా లేదు.

- Advertisement -

ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం షూటింగ్ లు ఆగిపోయిన సినిమాల వరకే తిరిగి మొదలుపెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది కానీ కొత్త సినిమాల షూటింగ్ లు మొదలుపెట్టుకోవడానికి కాదు. అది జరగాలంటే మరో నెల రోజులైనా ఆగకతప్పదేమో.

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయగా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు సమాయత్తమవుతున్నాడు. అలాగే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు ఆగస్ట్ నుండి షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All