Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌!

అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌!

అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌!
అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌!

`బాహుబ‌లి` త‌రువాత బాలీవుడ్‌లో టాలీవుడ్ చిత్రాల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఇక్క‌డ ఏ సినిమా హిట్ అయినా దాన్ని హిందీలో రీమేక్ చేయాల‌ని, ఆ సినిమా తామే న‌టించాల‌ని బాలీవుడ్ హీరోలు ఉళ్ల‌ళ్లూరుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్టేట్‌మెంట్‌లు ఇచ్చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో పాటు హీరో బ‌న్నీపై కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అంత‌కు మించి ఈ చిత్ర సంగీతం టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ చిత్రాన్ని ఇత‌ర భాష‌ల్లో రీమేక్ చేయ‌డానికి గ‌ట్టి పోటీ నెల‌కొంది. బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అల్లు అర‌వింద్ తానే రీమేక్ చేస్తాన‌ని చెబుతున్నారట‌.

- Advertisement -

ఇదిలా వుంటే ఈ సినిమా రీమేక్ చేస్తే అందులో న‌టించ‌డానికి తాను సిద్ధంగా వున్నాన‌ని యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ వెల్ల‌డించాడు. ఈ చిత్రాన్ని తాను నెట్‌ఫ్లిక్స్‌లో చూశాన‌ని, త‌న‌కెంతో న‌చ్చింద‌ని, అల్లు అర్జున్ న‌టించార‌ని, అవ‌కాశం ఇస్తే ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి తాను సిద్ధంగా వున్నాన‌ని, అయితే ఈ చిత్ర రీమేక్ కోసం రేసులో తాను వున్నానో లేదో తెలియ‌ద‌ని వెల్ల‌డించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All