Homeటాప్ స్టోరీస్తనీష్ కొత్త సినిమా “మహాప్రస్థానం”

తనీష్ కొత్త సినిమా “మహాప్రస్థానం”

Mahaprasthanam First Look Motion Poster
Mahaprasthanam First Look Motion Poster

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “దేవుళ్ళు” సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత మన్మధుడు సినిమాలో సోనాలి బింద్రే తమ్ముడు గా సునీల్ కాంబినేషన్ లో అద్భుతమైన హాస్యాన్ని పండించాడు తనీష్. బాలనటుడిగా ఒకానొక టైంలో ఫుల్ బిజీగా సినిమాలు చేసిన తనీష్ ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని రవిబాబు దర్శకత్వంలో వచ్చిన “నచ్చావులే” సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత నాని కాంబినేషన్ లో వచ్చిన “రైడ్” సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ కొన్ని సినిమాలు తప్ప ఆ తర్వాత తనీష్ చేసిన సినిమాలు ఆయనకు కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. “ఏం పిల్లో ఏం పిల్లడో” సినిమాలో నటి ప్రణీత తో అద్భుతమైన కెమిస్ట్రీ పండించాడు. మంచు ఫ్యామిలీ వారందరూ కలిసి నటించిన “పాండవులు పాండవులు తుమ్మెద” సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ లో కనిపించాడు తనీష్. బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్ బాస్ గేమ్ షో సీజన్ 2 టూ లో చివరి వరకు తనదైన నిజాయితీ, ముక్కుసూటితనం, ఆటిట్యూడ్ తో ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా “మహాప్రస్థానం” అనే సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “ద జర్నీ ఆఫ్  ఎమోషనల్ కిల్లర్” అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో మంచి రఫ్ లుక్ తో మనకు అభిమానులకు మంచికి ఇచ్చారు తనీష్. ఎన్నో హిట్ సినిమాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ గారు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. ఓంకారేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది. జానీ గారు ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి.. తనీష్ మళ్లీ సోలో హీరోగా ఫుల్ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All