Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసారుగా!!

లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసారుగా!!

లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసారుగా!!
లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసారుగా!!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం సమ్మర్ లోనే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. లవ్ స్టోరీ చిత్ర ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సారంగా దరియా సాంగ్ సూపర్ సెన్సేషన్ అయింది. దీంతో పాటు విడుదలైన పాటలు కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి.

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించింది. లవ్ స్టోరీ ద్వారా పవన్ సిహెచ్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర రిలీజ్ డేట్ ను లాక్ చేసారు. ప్రస్తుతం సినిమాలు విడుదలై జనాలు థియేటర్లకు వస్తుండడంతో లవ్ స్టోరీ నిర్మాతలు విడుదల చేయడానికి ధైర్యం చేసారు.

- Advertisement -

మొత్తానికి సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా లవ్ స్టోరీ తెరకెక్కింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All