Homeగాసిప్స్సెప్టెంబర్ లో విడుదల కానున్న లవ్ స్టోరీ?

సెప్టెంబర్ లో విడుదల కానున్న లవ్ స్టోరీ?

సెప్టెంబర్ లో విడుదల కానున్న లవ్ స్టోరీ?
సెప్టెంబర్ లో విడుదల కానున్న లవ్ స్టోరీ?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సింది. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడడంతో సినిమాను విడుదల చేయడం కుదర్లేదు. లవ్ స్టోరీ చిత్రంపై మంచి బజ్ ఉంది. విడుదలైన పాటలు అన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

దీంతో చాలా ఓటిటి సంస్థలు అదిరిపోయే ఆఫర్స్ తో లవ్ స్టోరీ నిర్మాతల ముందుకు వచ్చాయి. అయితే నిర్మాతలు మాత్రం మొదటి నుండి ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

దీంతో లవ్ స్టోరీ మేకర్స్ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని అనుకుంటున్నారు నిర్మాతలు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుంది. శేఖర్ కమ్ముల ఈ సినిమాను డైరెక్ట్ చేయగా ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All