
తమిళ స్టార్ హీరో ధనుష్ తో సెన్సిబుల్ చిత్రాలు చేసే శేఖర్ కమ్ముల సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా వెల్లడించాడు. సాధారణంగా శేఖర్ కమ్ముల తన సినిమాలను తనే రాసుకుంటాడు. సినిమా సినిమాకూ మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు కానీ ఈసారి చాలా త్వరగానే స్క్రిప్ట్ ను పూర్తి చేసాడు. ధనుష్ సినిమా ఫైనల్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసేసాడు.
అయితే ఇంకా ధనుష్ కు ఈ స్క్రిప్ట్ ను నరేట్ చేయలేదు. త్వరలోనే ధనుష్ ను శేఖర్ కమ్ముల కలిసి ఫుల్ స్క్రిప్ట్ ను వినిపిస్తాడట. ఫస్ట్ నరేషన్ విన్న ధనుష్ ఇంప్రెస్ అయ్యి ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మరోవైపు పూజ హెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న బిజీకి పూజ హెగ్డే డేట్స్ ఇవ్వగలదా అనేది ప్రధాన ప్రశ్న.