Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీ రిలీజ్ కన్ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో?

లవ్ స్టోరీ రిలీజ్ కన్ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో?

లవ్ స్టోరీ రిలీజ్ కన్ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో?
లవ్ స్టోరీ రిలీజ్ కన్ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రంపై ఈ ఏడాది ప్రారంభంలో బోలెడంత బజ్ ఉండేది. ఈ చిత్రంలోని సాంగ్స్ కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. నాలుగు పాటలు విడుదలవ్వగా నాలుగు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 10న వినాయక చవితి స్పెషల్ గా విడుదల చేద్దామనుకుంటే సరిగ్గా ఆరోజునే టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది.

దీనిపై లవ్ స్టోరీ నిర్మాతలు రభస చేసారు కూడా. ఆ తర్వాత పూర్తిగా ఈ వ్యవహారం సైలెంట్ అయింది. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ రిలీజ్ లేనట్లే. ఎందుకంటే ఇంకా విడుదలకు 9 రోజులే ఉండగా ఎక్కడా ప్రమోషన్స్ మొదలుకాలేదు. ఇక అదే రోజుకు వేరే చిత్రాలు విడుదలవుతున్నాయి.

- Advertisement -

మరి లవ్ స్టోరీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సెప్టెంబర్ 30న అంటూ మరో డేట్ వినిపిస్తోంది. మరి నిర్మాతలు ఈ కన్ఫ్యూజన్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All