Homeటాప్ స్టోరీస్యు టర్న్ లాస్ కానీ లాభాలొచ్చాయంటున్నారు

యు టర్న్ లాస్ కానీ లాభాలొచ్చాయంటున్నారు

Loss for u turn buyersసమంత కీలక పాత్ర పోషించిన చిత్రం యు టర్న్ . వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్13న విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు దాంతో ప్లాప్ జాబితాలో చేరిపోయింది యు టర్న్. కానీ యు టర్న్ చిత్ర బృందం మాత్రం మా చిత్రం సూపర్ హిట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. 6కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని కానీ మాకు ఇప్పటి వరకు 9 కోట్లకు పైగా షేర్ వచ్చిందని అంటున్నారు. ఆరున్నర కోట్లకు అమ్మితే తొమ్మిదిన్నర కోట్ల షేర్ అంటే మూడున్నర కోట్ల లాభాలు వచ్చాయన్న మాట.

కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే అందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో యు టర్న్ సినిమాని కొన్న బయ్యర్ కు ఇప్పటి వరకు 70 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. అంటే పెట్టిన పెట్టుబడి లో సగం మాత్రమే వచ్చింది. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా తక్కువే వచ్చాయి . బయ్యర్లకు అందరికి కూడా నష్టాలు వచ్చాయి కానీ చిత్ర బృందం మాత్రం లాభాలు వచ్చాయని అంటున్నారు అదేంటో ? యు టర్న్ నిర్మాతకు మాత్రం లాభం వచ్చినట్లే ఎందుకంటే….. శాటిలైట్ తో పాటు బయ్యర్ల నుండి డబ్బులు వచ్చాయి దాంతో లాభాలు నిర్మాతకు మాత్రమే అంతేకాని బయ్యర్లకు కాదు. ఇక బయ్యర్లకు లాభాలు వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే మరో నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత విడుదల అవుతోంది మరి.

- Advertisement -

English Title: Loss for u turn buyers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All