Homeటాప్ స్టోరీస్మిడిల్ ఫింగర్ చూపెట్టి షాక్ ఇచ్చిన సమంత

మిడిల్ ఫింగర్ చూపెట్టి షాక్ ఇచ్చిన సమంత

Samantha shows her middle finger to netizens పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు , నాకు అనవసరమైన సలహాలు ఇస్తున్న వాళ్లందరికీ ఇదే నా సమాధానం అంటూ మిడిల్ ఫింగర్ చూపెడుతున్న ఇమేజ్ ఒకదాన్ని పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది సమంత. తాజాగా ఈ భామ తన భర్త నాగచైతన్య తోకలిసి పబ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను ట్వీట్ చేసి షాక్ ఇచ్చింది , దాని తర్వాత స్పెయిన్ లో నాగచైతన్య తో కలిసి ఉన్న చిన్న చిన్న పీలికల్లాంటి బట్టలను వేసుకొని ఫోటోలకు ఫోజివ్వడమే కాకుండా వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఎత్తున సమంతపై విమర్శలు చేసారు. ఈ విమర్శల జడివాన ఎలా ఉందంటే సమంత భరించలేనంతగా ఉంది దాంతో చిర్రెత్తుకొచ్చి మిడిల్ ఫింగర్ ఉన్న ఇమేజ్ ని పోస్ట్ చేసి ఘోరంగా అవమానించింది.

కొంతమంది నెటిజన్లు తీవ్రంగా సమంతని విమర్శించారు అయితే సమంత మాత్రం తక్కువ తినలేదు , పెళ్లి చేసుకొని అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యింది కాబట్టి ఆ ఇంటి పరువు కాపాడమని , బాధ్యతగా వ్యవహరించమని ……మనది భారతీయ సంస్కృతి అని దాన్ని గుర్తు చేసుకోమని చెబుతున్నారు అంతే ! ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని ఇతరులు సమంతని డిమాండ్ చేయలేరు కానీ అక్కినేని కోడలు అనే ట్యాగ్ ఉంది కాబట్టి ఆ బాధ్యత మరువకూడదు అని మాత్రమే అంటున్నారు నెటిజన్లు, కానీ సమంత మాత్రం ఎక్కడా తగ్గడం లేదు …… అందాలు ఆరబోయడంలో కావచ్చు , నెటిజన్లుని విమర్శించడంలో కావచ్చు. ప్రస్తుతం నాగచైతన్య -సమంత స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సమంత నటించిన యు టర్న్ చిత్రానికి , నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి మంచి టాక్ తో పాటుగా మంచి వసూళ్లు రావడంతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -

English Title: Samantha shows her middle finger to netizens

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All