Homeటాప్ స్టోరీస్మార్చ్ 31వ తేదీ వరకూ లాక్ డౌన్

మార్చ్ 31వ తేదీ వరకూ లాక్ డౌన్

మార్చ్ 31వ తేదీ వరకూ లాక్ డౌన్
మార్చ్ 31వ తేదీ వరకూ లాక్ డౌన్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం వైరస్ వ్యాప్తి ఎక్కువగా గల 75 జిల్లాల జాబితాను విడుదల చేసింది.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, విజయవాడ, వైజాగ్ లతో పాటూ…  తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, మేడ్చల్,రంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ గల రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కేరళ ఢిల్లీ ముందు వరుసలో ఉన్నాయి. అత్యధిక జాబితా గల జిల్లాలు కూడా ఈ మూడు రాష్ట్రాల లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ 75 జిల్లాలకు సంబంధించి లాక్ డౌన్  పాటించమని మరియు ఈ జిల్లాల మధ్య ఎటువంటి రాకపోకలు అత్యవసర సేవలు సర్వీసులు తప్ప మరేవీ ఉండరాదని ప్రజలు ముఖ్యంగా అన్ని రకాల పనులకు సంబంధించి ఈ జిల్లాలలో ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి ప్రయాణాలు చేయరాదని సూచనలు ఉన్నాయి.

ఇప్పటికే భారతదేశ కేంద్ర కేంద్ర పరిధిలో అన్ని రకాల రైళ్లను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేశారు. అత్యవసర సర్వీసులు,వైద్యము,అగ్నిమాపక సర్వీసులు మీడియా, నిత్యావసర సరుకులు, బియ్యము, మందులు ఇతర ప్రజా అవసరాల సర్వీసులు తప్ప మరి ఏ ఇతర మైనటువంటి వాహనాలను ప్రజలను ఈ జిల్లాలకు సంబంధించి ప్రయాణాలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు భారతదేశం లో నమోదైన 300 పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులలో అన్ని ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా సంక్రమించబడిన కేసులు ఉన్నాయి. ఇక్కడ లోకల్ గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించిన కేసులు చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత మరియు స్వీయ నియంత్రణ పాటించాలి. దాదాపు 14 రోజుల వరకు స్వీయ నిర్బంధంలో ఉంటే కరోనా వైరస్ వ్యాప్తిని కొంత వరకు కట్టడి చేయవచ్చు. లేదంటే కరోనా వైరస్ మూడవ స్టేజి ఈ చేరుకుంది అంటే మన పొరుగు దేశాలైన చైనా,ఇటలీ,ఇరాన్ తదితర దేశాలలో సంభవించినట్లు మన దేశంలో కూడా వేలల్లో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలను దాదాపు 14 రోజుల వరకూ స్వీయ నిర్బంధంలో ఉండమని 31వ తేదీ వరకు అత్యవసర వైద్య ఆరోగ్య అగ్నిమాపక సర్వీసులు మినహా అన్ని రకాల సర్వీసులను లాక్ డౌన్ లో  ఉంచినట్లు ప్రకటించారు.

Lockdown list
Lockdown list
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All