
అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అక్టోబర్ 8న విడుదల కానున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా లెహరాయి సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. గోపి సుందర్ ట్యూన్ కు సిద్ శ్రీరామ్ గానం పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ ప్రోమో వింటుంటే చార్ట్ బస్టర్ ఆల్బమ్ లోడింగ్ లా అనిపిస్తోంది.
ఇక ఈ ప్రోమోలో విజువల్స్ అఖిల్, పూజల మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తోంది. వీరిద్దరూ పెయిర్ గా బాగున్నారు. ఇక సాంగ్ లో ఘాటు రొమాన్స్ దృశ్యాలు కూడా ఉన్నాయి. లెహరాయి ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించారు. మరి చూడాలి ఈ సినిమాతో అఖిల్ తన తొలి హిట్ ను అందుకుంటాడేమో.
