Monday, October 3, 2022
Homeటాప్ స్టోరీస్లారెన్స్ బ్ర‌దర్‌పై జూనియ‌ర్ ఆర్టిస్ట్ సంచ‌ల‌నం!

లారెన్స్ బ్ర‌దర్‌పై జూనియ‌ర్ ఆర్టిస్ట్ సంచ‌ల‌నం!

లారెన్స్ బ్ర‌దర్‌పై జూనియ‌ర్ ఆర్టిస్ట్ సంచ‌ల‌నం!
లారెన్స్ బ్ర‌దర్‌పై జూనియ‌ర్ ఆర్టిస్ట్ సంచ‌ల‌నం!

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ త‌మ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ పై ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. 29 ఏళ్ల దివ్య అనే జూనియ‌ర్ ఆర్టిస్ట్ త‌న‌ని లారెన్స్ సోద‌రుడు ఎల్విన్ వేధిస్తున్నార‌ని ఆరోపించింది. దీంతో కోలీవుడ్‌లో లారెన్స్ సోదరుడి వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

మీడియా ముందుకు వ‌చ్చిన దివ్య త‌న‌ని లారెన్స్ సోద‌రుడు ఎల్విన్, అత‌నితో పాటు కొంత మంది పోలీస్ ఆఫీస‌ర్స్ త‌న‌ని గ‌త కొంత కాలంగా వేధిస్తున్నార‌ని, గ‌త 6 ఏళ్లుగా త‌ను వేధింపుల‌కు గుర‌వుతున్నాన‌ని వెల్ల‌డించింది. ఎల్విన్‌పై మారేడుప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని వాపోయింది.

న‌టిగా ఎద‌గాల‌నుకున్న త‌న కెరీర్‌ని, త‌న లైఫ్‌నీ తాజా వివాదం నాశ‌నం చేసింద‌ని, మారేడుప‌ల్లి సీఐ ఎల్విన్‌కు అండ‌గా వున్నార‌ని దివ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై లారెన్స్ గానీ, అత‌ని సోద‌రుడు గానీ స్పందించ‌లేదు. తాజా వివాదంపై లారెన్స్ అయినా వివ‌ర‌ణ ఇస్తే వివాదం స‌మ‌సిపోయే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts