Homeటాప్ స్టోరీస్ప్రభాస్ పెళ్లి సాహో అయ్యాక ఖాయమట

ప్రభాస్ పెళ్లి సాహో అయ్యాక ఖాయమట

latest update about prabhas weddingఇప్పటికే 38 సంవత్సరాలు పూర్తయ్యాయి ప్రభాస్ కు , బాహుబలి సమయంలో పెళ్లి అన్నారు కానీ అది అయిపొయింది బాహుబలి 2 కూడా పూర్తయ్యింది కానీ పెళ్లి కాలేదు ఇక అప్పటి నుండి అదిగో ఇదిగో అంటూ ప్రభాస్ పెళ్లి పై పుకార్లు వస్తూనే ఉన్నాయి దానికి అనుష్క పెళ్లి కూడా కాకపోవడంతో ప్రభాస్ – అనుష్క లు ప్రేమించుకుంటున్నారని అందుకే పెళ్లి ఆలస్యం అవుతోందని పుకార్లు పుట్టాయి వాటిని కూడా ఖండించారు ఆ ఇద్దరూ . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ పెళ్లి పై పుకార్లు వస్తున్నాయి , అయితే ఈసారి మాత్రం తప్పకుండా సాహో షూటింగ్ అయ్యాక పెళ్లి జరుగుతుందని అంటున్నాడట ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు .

గతంలో చాలాసార్లు ప్రభాస్ పై ఒత్తిడి తెచ్చాడు కృష్ణంరాజు కానీ ఎంతగా ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్ళికి ఒప్పుకోలేదు . ఆ విషయం ఎప్పుడూ వాయిదాపడుతూనే ఉంది కానీ ఈసారి మాత్రం సాహో రిలీజ్ అయ్యాక తప్పకుండా పెళ్లి అవుతుందని అంటున్నారట ! అదిగో పులి ఇదిగో మేక అన్నట్లుగా తయారయ్యింది ప్రభాస్ పెళ్లి . ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రం చేస్తున్నాడు , అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సాహో ఎప్పుడు పూర్తవుతుందో ? ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందో ? ఏమో ?

- Advertisement -

English Title: latest update about prabhas wedding

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All