Tuesday, March 21, 2023
Homeన్యూస్'లాస్ట్ సీన్' ఫస్ట్ లుక్ రిలీజ్!

‘లాస్ట్ సీన్’ ఫస్ట్ లుక్ రిలీజ్!

last seen movie first look launchజి.పి.ఏ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అండ్ శ్రీ ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో దీపక్ బల్ దేవ్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లాస్ట్ సీన్’. హర్ష్, తులికా సింగ్, హిమాయత్, మధు నారాయణన్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ భారతి సిమెంట్స్ అసిస్టెంట్ వైఎస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆర్.రాఘవ్ ప్రతాప్ చేతుల మీదుగా విడుదలయింది.

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్నింగ్ ప్రాబ్లెమ్ అయిన ‘మీ టూ’ నేపధ్యంలో హిందీ, తెలుగులో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి (సినిమాటోగ్రఫీ), నాగిరెడ్డి (ఎడిటింగ్) తమ చిత్రానికి పని చేస్తుండడం గర్వంగా భావిస్తున్నామని దర్శకులు దీపక్ బల్ దేవ్ ఠాకూర్ అన్నారు. మేజర్ షెడ్యూల్ ఊటీలో చేశామని, 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు.

తన చేతుల మీదుగా ‘లాస్ట్ సీన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని చెప్పిన ముఖ్య అతిధి ఆర్. రాఘవ ప్రతాప్.. బహుముఖ ప్రతిభాశాలి దీపక్ దర్శకత్వంలో హిందీ. తెలుగు భాషల్లో రూపొందుతున్న ‘లాస్ట్ సీన్’ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.

హీరోయిన్ తూలికా సింగ్ మాట్లాడుతూ… మహా నగరం వెళ్లి, మహా దర్జాగా బ్రతకాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయికి ఎదురైన పలు ఆసక్తికర సంఘటనల సమాహారంగా రూపొందుతున్న ‘లాస్ట్ సీన్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది’ అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, మ్యూజిక్: అనిల్-సంజీవ్, డైలాగ్స్: రామన్ గోయల్, సమర్పణ: శ్రీమతి అండ్ శ్రీ ప్రకాష్ ఠాకూర్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దీపక్ బల్ దేవ్ ఠాకూర్!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts