
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తోన్న సినిమా అఖండ. ఈ సినిమా షూటింగ్ ఈపాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కొంత తగ్గడంతో షూటింగ్స్ ను పూర్తి స్థాయిలో చేసుకుని వెసులుబాటు దొరికింది.
అఖండ షూటింగ్ ను త్వరలోనే తిరిగి మొదలుపెట్టనున్నారు. వచ్చే నెల మొదటి వారంలోనే అఖండ షూటింగ్ తిరిగి ప్రారంభవుతుంది. ఆగస్ట్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలన్నది టార్గెట్. ఇక అఖండలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసాడు బోయపాటి శ్రీను. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించడానికి లక్ష్మీ రాయ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
బాలయ్య, లక్ష్మీ రాయ్ కలిసి ఇదివరకు అధినాయకుడు చిత్రంలో నటించారు. ఇప్పుడు థమన్ అందించిన మాస్ బీట్ కు వీరిద్దరూ ఆడనున్నారు. పూర్ణ, ప్రగ్య జైస్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.