Homeగాసిప్స్సెప్టెంబర్ రిలీజ్ కోసం చూస్తున్న అఖండ

సెప్టెంబర్ రిలీజ్ కోసం చూస్తున్న అఖండ

సెప్టెంబర్ రిలీజ్ కోసం చూస్తున్న అఖండ
సెప్టెంబర్ రిలీజ్ కోసం చూస్తున్న అఖండ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా అఖండ. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను అత్యంత కేర్ తో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ను ఈ చిత్రంలో పోషిస్తున్నాడు.

అఖండ మెజారిటీ షూటింగ్ సెకండ్ వేవ్ కన్నా ముందే పూర్తయింది. మే 28న చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు కూడా. అయితే కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరగడంతో షూటింగ్ ను అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్స్ మళ్ళీ మొదలవుతున్నాయి.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ లో అఖండను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఈ చిత్రంలో ఒక విలన్ గా చేస్తుండడం విశేషం. అఖండ చిత్ర టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All